మల్లాపూర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాములు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ను మరియు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులను దూషిస్తూ సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అదే గ్రామానికి చెందిన దామెర నారాయణరెడ్డి పిర్యాదు చేయడంతో రాములుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు గ్రూప్ అడ్మిన్ గా ఉన్న మాజీ సర్పంచ్ గోవింద్ నాయక్ కు నోటీసు ఇచ్చామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.