- ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.శనివారం జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమoలో 5 లక్షలతో ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలను డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, స్థానిక వ్యాపారులతో కలసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడు తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.సిసి కెమెరాల ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎర్పాటు చేయడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్షా జరిపి రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్త లో తీసుకోవచ్చు అన్నారు. జిల్లా ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహాయ సహకారాలు అందించిన డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, మరియు వ్యాపారులను జిల్లా ఎస్పీ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.