జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
బదిలీపై వెళుతున్న అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలో భాగంగా ఇంటెలిజెన్స్ ఆఫీస్ కు కు బదిలీ పై వెళుతున్న అడిషనల్ ఎస్పీని,జిల్లా ఎస్పీ శాలువా, పూలమాల తో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసిన వినోద్ కుమార్ సేవలు అభినందనీయ మని అన్నారు.ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలం దిస్తే గుర్తింపు పొందుతారనే దానికి వినోద్ కుమార్ ఒక నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమైనని బదిలీ అయిన చోట కూడా ఇదే విధంగా విధులు నిర్వహిస్తూ ఉన్నత అధికారుల మనల్ని పొందే విధంగా ఉండాలని కోరారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడు తూ…. జిల్లాలో సుమారు 5 నెలల పాటు నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని జిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఎలాంటి చిన్న అవాంఛనియ సంఘటనలు జరగకుండా, గొడవలు లేకుండా ప్రశాంతవాతావరణం లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా విధులు నిర్వహించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు , డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, రంగా రెడ్డి మరియు డిసిఆర్బీ, ఎస్బి ,సీసీఎస్, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, అరఫ్ అలీ ఖాన్, లక్ష్మీనారాయణ మరియు సి.ఐ లు వేణుగోపాల్, రవి, కృష్ణ రెడ్డి ,ఆర్ఐ లు రామకృష్ణ , కిరణ్ , వేణు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.