Rr News Telangana
మెట్ పల్లి

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రెడ్డిలా రాజ్యం

* మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్ జరుగుతుంది…?

* ఓ మహిళను పోలీస్ స్టేషన్ సమీపంలోనే అసభ్యకరంగా ప్రవర్తించిన మడపతి ప్రమోద్

* మడపతి ప్రమోద్ సిఐ వర్గానికి చెందిన వారు కావడంతో వదిలేసిన సిఐ

• తన వర్గానికి చెందిన వారు ఎమ్ చేసిన వదిలేస్తున్న సిఐ నిరంజన్ రెడ్డి

* కొత్త చట్టాలు ఎవరికి చుట్టాలు

* మెట్ పల్లిలో ఇన్ని రోజులు లేని వర్గా పోరు ఇప్పుడు ఎందుకు…?

* గత నెల 15 న పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

*ఇప్పటివరకు కేసు నమోదు చేయని పోలీసులు

* మెట్ పల్లిలో మొదలైన వర్గపోరు…!

*ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి మరి…?

*జిల్లా ఎస్పీని కలుస్తానన్న బాధితురాలు

*మహిళకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి మరి….?

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : 

తనకు పోలీస్ స్టేషన్ సమీపంలో తనతో అసభ్యకరంగా మాట్లాడారని ఓ మహిళ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో గత నెల 15 న ఫిర్యాదు చేసింది.అయితే ప్రమోద్ సిఐ నిరంజన్ రెడ్డి వర్గానికి చెందిన వారు కావడంతో నిందితుడిని ఇక గంటలేనే వదిలేసినట్లు బాధితురాలు ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ జర్నలిస్టును ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు చేసి 18 రోజులు అవుతున్న ప్రమోద్ పై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రమోద్ అనే వ్యక్తి సిఐ నిరంజన్ రెడ్డి వర్గానికి చెందిన వాడు కావడంతో ప్రమోద్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అదే తన వర్గానికి చెందిన వారు కాకపోతే కేసు నమోదు చేసేవారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది…తనకు ఆ మహిళ కుటుంబానికి ప్రమోద్ అనే వ్యక్తి వల్ల ప్రాణహాని ఉందని ఆ మహిళ కుటుంబానికి ఎమ్ జరిగిన దానికి బాధ్యులు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి అని బాధితురాలు తెలిపింది.

జిల్లా ఎస్పీని కలుస్తానన్న మహిళ :

మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తన వర్గానికే చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని, తన వర్గానికి చెందిన వారు ఎమ్ చెపితే అదే చేస్తున్నాడని, జగిత్యాలకు చెందిన ఓ విలేఖరి సిఐ నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి మన వర్గానికే చెందిన వాడే ప్రమోద్ అని అతడిని వదిలేయాలని తెలుపడంతో ప్రమోద్ ను కేవలం గంట వ్యవధిలోనే సిఐ నిరంజన్ రెడ్డి వదిలేశారని. అతడు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మహిళను నీ సంగతి చూస్తానని ఆ మహిళను పోలీస్ స్టేషన్ లోనే బెదిరించినట్లు బాధిరాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే భయంగా ఉందని.. పోలీస్ స్టేషన్ లో డబ్బు ఉన్న వాడికే మరియు పలుకుబడి ఉన్నవారికే న్యాయం జరుగుతుందని…సామాన్యులకు పోలీస్ స్టేషన్ లలో న్యాయం జరగడం లేదని బాధిత మహిళ అవేదన వ్యక్తం చేస్తుంది. లీడర్లతో గంటలపాటు సిఐ తన రూమ్ లో కూర్చోపెట్టుకొని సెటల్ మెంట్ లు చేసే టైమ్ ఉంది కానీ. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేసే టైం లేదా అంటూ.పోలీస్ స్టేషన్ కు న్యాయం చేయాలని వెళ్లిన వారిని సిఐ నిరంజన్ రెడ్డి పట్టించుకోవడం లేదని.గత నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశానని, అదే పోలీస్ స్టేషన్ లో రాత్రి 8 గంటల వరకు ఉన్న కూడా తనకు న్యాయం జరగలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది.

Related posts

మురికి కాలువలో కొట్టుకువచ్చిన పసికందు మృతదేహం

Rr News Telangana

ఎంపీ అరవింద్ పై అసత్యపు ప్రచారాలు మానుకోవాలి

Rr News Telangana

కాళ్లు మొక్కుతూ.. ఓట్లు అడుగుతూ

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group