- ఒక ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ట్రాలీ స్వాధీనం
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న యశాడా వెంకటి అనే వ్యక్తి మెట్ పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామ శివారులో తన ట్రాక్టర్ ట్రాలీని పార్క్ చేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి ట్రాలీని దొంగలించడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న చెప్యాల శంకర్ అనే వ్యక్తి మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద పార్క్ చేసిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగలించడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసిన ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యలో భాగంగా మంగళవారం బస్ డిపో వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడుతుంది తామేనని అంగీకరించారు. నిందితులు 01. కోరుట్ల మండలంలోని రామారావుపల్లె గ్రామానికి చెందిన పొన్నం రవీందర్ గౌడ్ ట్రాక్టర్ ట్రాలీలు కొంటూ అమ్ముతుంటా డాని,ఈ క్రమంలోనే గ్రామాలలో ట్రాక్టర్ ట్రాలీ కొరకు వేతుకుతుండగా చౌలమద్ది శివారులో ట్రాక్టర్ ట్రాలీ కనిపించడంతో దొంగలించినట్లు రవీందర్ గౌడ్ పోలీసులకు తెలిపాడు.02. మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన మదికుంట మహేష్ మద్యానికి బానిసై, జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని, మెట్ పల్లి
మార్కెట్ యార్డ్ సమీపంలో టీవీఎస్ స్టార్ సిటీ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి మంగళవారం ట్రాలీతో పాటు ద్విచక్ర వాహనాన్ని అమ్మే క్రమంలో రవీందర్ గౌడ్,మహేష్ ఇద్దరు మెట్ పల్లి వైపు వస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న మెట్ పల్లి ఎస్ఐ చిరంజీవి, సిఐ నిరంజన్ రెడ్డిని మరియు సిబ్బందిని డిఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు.