Rr News Telangana
మెట్ పల్లి

విలేఖరిని తిట్టిన ఇద్దరిపై కేసు నమోదు

  • నేను బిఆర్ఎస్ నాయకుడిని నన్ను ఎవడేం చేయలేడని అహంకారమా…?

మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

విలేఖరిని తిట్టిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే…జగిత్యాల పట్టణంలోని శివాజీవాడకు చెందిన దాడి రామవ్వ, బాలపెల్లి గ్రామానికి చెందిన మడిపతి ప్రమోద్ తన బామ్మర్ది అయిన నలువాల శ్రీనివాస్ భార్య రజిత 02/01/2023న జగిత్యాల కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది. జగిత్యాల కోర్టు 09/02/2024లో రజితకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తన పుట్టింటి వారు ఇచ్చిన సామాన్లను తనకు ఇవ్వకపోగా తన పేరు మీద ఉన్న ఇల్లుని మరియు ఒక ల్యాండ్ ను తమ పేరు మీద చెయ్యాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి అయిన రాజశేఖర్ ను రజిత ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని జర్నలిస్ట్ రాజశేఖర్ సూచించాడు. దీనితో రజిత పోలీసులను ఆశ్రయించింది. అయితే రజిత పుట్టింటి నుండి తెచ్చుకున్న సామగ్రిని తనకు ఇవ్వాలంటే తన పేరు పైన ఉన్న ఆస్తిని రామవ్వ పేరు మీద చేయాలని లేదంటే నువ్వు జర్నలిస్టుతో అక్రమ సంబంధం పెట్టుకున్నవని నీ పరువు తిస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. దీనితో జర్నలిస్ట్ జగిత్యాల టౌన్ కు ఫోన్ చేసి రజితకు న్యాయం చేయాలని పోలీసులకు తెలుపగ, పోలీసులు దాడి రామవ్వ మరియు మడపతి ప్రమోద్ లను స్టేషన్ కు పిలిపించారు. దీంతో ఆగ్రహనికి గురైన దాడి రామవ్వ మరియు ఆమె అల్లుడు మడపతి ప్రమోద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో కు శనివారం ఫోన్ చేసి నన్నే పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తావ అంటూ నువ్వైనా ఉండాలి లేదా నేనైన ఉండాలి అంటూ జర్నలిస్ట్ ను భూతులు తిట్టడంతో ఆ జర్నలిస్ట్ విధుల నిమిత్తం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కాల్ రికార్డు చేసిన జర్నలిస్ట్ , మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో పాటు ఆడియో రికార్డు కూడా వినిపించాడు. దీంతో దాడి రామవ్వ మరియు మడపతి ప్రమోద్ లపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే మడపతి ప్రమోద్ బిఆర్ఎస్ నాయకుడినని నాకు పోలీసులు అందరూ తెలుసు అంటూ పంచాయితీలు చేస్తూ పలుచోట్ల డబ్బులు దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నిజాలను నిర్భయంగా రాస్తాం….

ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ఎప్పుడు నిజాలను నిర్భయంగా రాస్తుందని… బెదిరింపులకు ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ  తలవంచదని.. ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తే ఇక్కడ భయపడే వారెవరు లేరని మరోసారి ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ స్పష్టం చేస్తోంది.

Related posts

అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారుతున్న మెట్ పల్లి

Rr News Telangana

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రెడ్డిలా రాజ్యం

Rr News Telangana

సబ్బని శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group