- 14,200 నగదు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మెట్ పల్లి మండలంలోని వేంపేట గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి ఐదుగురు వ్యక్తులు పేకాట అడుతుండగా 5 గురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా మరో ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. వారి వద్ద నుండి 14,200 నగదు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ పేకాట రాయుళ్ల 1. పెంటపర్తి విజయసాగర్, 2.జెల్లా శ్రీనివాస్ 3.ఏలేటి విక్రమ్ రెడ్డి 4.పెంటపర్తి శ్రీనివాస్ 5.అల్లూరి సురేందర్ లు ఉన్నారు. పారిపోయిన వ్యక్తుల వివరాలు పారిపోయిన ముగ్గురు వ్యక్తులు 1.జెల్ల గంగాధర్ 2.బర్ల సుధీర్ 3.నర్సా రెడ్డి అని, వీరందరూ వేంపేట గ్రామానికి చెందిన వారిగా సిఐ తెలిపారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ చిరంజీవిని మరియు సిబ్బందిని సిఐ నిరంజన్ రెడ్డి అభినందించారు.