మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి మండలంలోని ఏఎస్ఆర్ తాండ,ఆత్మనగర్ తాండలో గుడుంబా స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. గుడుంబా తయారు చేసి అమ్ముతున్న సంతోష్ నాయక్, గంగాధర్ నాయక్ లను పట్టుకొని వారి వద్ద నుండి 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల వాష్ ముడి సరుకు పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ,, ఎవరైనా నిషేధిత గుట్కా మరియు గంజాయి, గుడుంబా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.