- సరైన పత్రాలు లేని 25 వాహనాలు సీజ్
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద బుధవారం సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సరైన పత్రాలు మరియు నంబర్ ప్లేట్ లేని 25 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు సిఐ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,, ప్రతి వాహన దారున్ని డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమనిపై కేసు నమోదు చేస్తామని అన్నారు.