Rr News Telangana
మెట్ పల్లి

గుడుంబా స్థావరంపై జిల్లా పోలీసుల దాడులు

  • 6 లీటర్ల గుడుంబా పట్టివేత, 90 లీటర్ ల బెల్లం పానకం ధ్వంసం
  • గుడుంబా రహిత జిల్లాగా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యం

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

గుడుంబా రహిత జిల్లాగా జగిత్యాలను చూడాలనే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 6 లీటర్ల గుడుంబాను,90 లీటర్ ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ మాట్లాడు తూ…ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గుడుంబాకు అలవాటు పడి ఎంతోమంది కుటుంబాలను చిన్నబిన్నం చేసుకొని చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.అంతే కాకుండా మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తునట్టు తెలిసిన, అమ్మిన వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గొప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వినోద్ రాథోడ్, ఇబ్రహీంపట్నం ఎస్.ఐ అనిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

Related posts

అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారుతున్న మెట్ పల్లి

Rr News Telangana

గండి హన్మాండ్లు, ఓబులపూర్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్

Rr News Telangana

ఆర్ కృష్ణయ్య పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group