మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి తహసీల్దార్ పై కలెక్టర్ కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్యాప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మెట్ పల్లి పట్టణానికి చెందిన మహమ్మద్ వసీం సోమవారం ప్రజావాణిలో మెట్ పల్లి తహసిల్దార్ పై జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఉన్నత చదువుల నిమిత్తం తనకు గ్యాప్ సర్టిఫికెట్ అవసరం ఉందని దరఖాస్తు చేసుకోగా, తనకి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అత్యవసరం ఉందని చెప్పినప్పటికీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని బాధితుడు తెలిపారు. ఇప్పుడు తాను చదివి ఉద్ధరించేది ఏమీ లేదని అవమానకరంగా మాట్లాడాడని వసీం తెలిపారు. మెట్ పల్లి తహసిల్దార్ పై వెంటనే చర్యలు తీసుకొని తనకు గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పించి న్యాయం చేయగలరని వసీం అధికారులను కొరుతున్నాడు.