Rr News Telangana
జగిత్యాల

రేపటి నుంచి అమల్లోకి కొత్తచట్టాలు

  • కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి
  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జూలై 1 అనగా రేపటి నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థ వంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.బికొత్తగా రూపొందించిన మూడు చట్టాలు – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం. జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కుల ను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

Related posts

గాయత్రి ఆస్పత్రి వైద్యుడు నీలి సాగర్ పై దాడి చేసిన నలుగురి పై కేసు నమోదు

Rr News Telangana

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

Rr News Telangana

చిన్నగట్టుపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group