నిజామాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఏపిసిసి అధ్యక్షుడు, మాజీమంత్రి డి.శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.ఆయన పార్ధివ దేహాన్ని శనివారం ఆస్పత్రి నుంచి బంజారా హిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి, మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచను న్నారు.పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మధ్యా హ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 2గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ కు తరలిస్తారు.ఆదివారం డిఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రి యలు జరగనున్నట్లు డిఎస్ కుటుంబ సభ్యులు తెలియ జేశారు.