- సిఐ నిరంజన్ రెడ్డి
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలను విక్రయించిన వారిపై, అలాగే సేవించే వారిపై ఉక్కు పాదం మోపుతామని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే దాబాల్లో మద్యం విక్రయించిన, గ్రామాల్లో పేకాట ఆడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నది నుంచి కానీ వాగుల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలించే వాహనాల యజమానుల తో పాటు డ్రైవర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గ్రామాల్లో వీడీసీలు అనధికార కార్యక్రమాలు చేపట్టిన, వేలం పాటలు నిర్వహించిన చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారులు మధ్య వర్తులు అవసరం లేకుండా నేరుగా వచ్చి సమస్యను మా దృష్టికి తీసుకు వచ్చి న్యాయం పొందాలని కోరారు. గ్రామాల్లో పెద్దమనుషులు పంచాయతీలు నిర్వహించి ఇబ్బందులకు గురిచేసిన అట్టి వారిపై చర్యలు కూడా తీసుకోబడును అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలను చేపట్టే వారిపై ఉక్కు పాదం మోపుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ పాల్గొన్నారు.