జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని శనివారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. విధి నిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలకు అందుకోనున పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. 1. కోరుట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI అలీముద్దీన్ (ఉత్తమ సేవ పథకం),
2. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న HC నసిర్ ఖాన్(ఉత్తమ సేవ పథకం)
3. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI వేంకటేశ్వర రావు (సేవ పథకం)
4. కథలాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న WHC రాజశ్రీ (సేవ పథకం)
5. DCRB జగిత్యాల విధులు నిర్వహిస్తున్న HC-రాజేంద్రప్రకాష్ (సేవ పథకం)
6. రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న HC-గంగారాం (సేవ పథకం)
7. రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న HC-సత్తయ్య (సేవ పథకం) అందుకొనున్నారు.