- సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రసాద్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
యోగాసనాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు రావని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రసాద్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది యోగాసనాలు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది ప్రతిరోజు యోగాసనాలు చేయాలని, యోగాసనాలు చేయటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రావని పేర్కొన్నారు. యోగ సాధనతోనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, యోగ గురువు హనుమాడ్లు మరియు జడ్జి ప్రసాద్ లను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు లక్ష్మారెడ్డి, వెంకట నరసయ్య వడ్డేపల్లి శ్రీనివాస్, హఫీజ్, భానుమూర్తి, శేఖర్, నరేందర్ రెడ్డి, వర్మ, జగన్ మోహన్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గంగాధర్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.