- డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కాళేశ్వరం, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందుకు కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫా బాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు ఎస్ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవ హారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది.ఎస్ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.