Rr News Telangana
జగిత్యాల

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం

  • కేసుల పరిష్కారంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ

జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారు రాజీమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు, కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురయ్యే వారికి సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి శనివారం కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి డీఎస్పీలు, సి.ఐలు ఎస్.ఐలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి 1894 కేసులో ఉన్నవారికి కోర్టు వారు మొదటి తప్పుగా బావించి జరిమానాలు విదించడం జరిగిందని మద్యం సేవించి వాహనం నడిపి మరోసారి పట్టుబడినట్లైతే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది, 538 ఈ- పెట్టి కేసులు,680 ఐపిసి కేసులు జిల్లావ్యాప్తంగా వివిధ సెక్షన్ల కింద నమోదు అయిన మొత్తం కేసులు 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

గణేష్ మృతదేహం లభ్యం

Rr News Telangana

అదుపు తప్పి మద్యం వాహనం బోల్తా

Rr News Telangana

అత్యాచారం కేసులో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group