Rr News Telangana
జగిత్యాల

నేను హోమ్ గార్డును నన్ను ఎవడు ఎమ్ పికలేడు

  • నేను అడిగినప్పుడు నాకు మందు ఇవ్వాల్సిందే
  •  వైన్స్ వద్ద హోమ్ గార్డు సుబ్బారాజు హాల్చల్
  •  జిల్లా ఎస్పీ గారు….జర చూడండి సారు….

మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జగిత్యాల జిల్లా… మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫాక్షన్ హాల్ సమీపంలోని ఓ వైన్స్ వద్ద హోమ్ గార్డు సుబ్బారాజు శనివారం సాయంత్రం నేను హోమ్ గార్డును అని నాకు ఫ్రీగా మందు ఇవ్వాలని గొడవ చేసినట్టు సమాచారం. వైన్స్ లోకి చొరబడి నానా హంగామా చేసినట్లు తెలుస్తోంది. కాగా వైన్స్ యాజమాని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తుంది… ఒక హోమ్ గార్డు అయ్యి ఉండి…ఓ క్వాటర్ కోసం ఇలా వైన్స్ లోకి చొరబడి మందు ఇవ్వాలని నానా హంగామా చేయడం ఏంటని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని..హోమ్ గార్డు మందు అడిగితే ఇవ్వకపోతే ఇంత హంగామా చేయడం ఏంటని…. ఫ్రెండ్లీ పోలీసు అంటే మరో నిదర్శనం మందును ఫ్రీగా ఇవ్వడమేనా…అని ప్రజలందురు నవ్వుకుంటున్నారు. జిల్లా ఎస్పీ స్పందించి పోలీసుల పరువును తీస్తున్న ఇలాంటి హోమ్ గార్డులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే..రేపు మరో హోమ్ గార్డు వచ్చి మందును ఫ్రీగా ఇవ్వలని లేదంటే ఇలాగే గొడవలకు దిగుతారని పలు వైన్స్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఎస్పీ గారు…జర చూడండి సారు…

జిల్లాలో జరుగుతున్న అగయిత్యాలు మాములుగా లేవు సారు…జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో సివిల్ పంచాయితీలు జరుగుతున్నాయి…పోలీసుల పేరు చెప్పుకుని… ఓ రాజకీయ నేత డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడని సమాచారం…జిల్లా ఎస్పీ గారు….మీరు ఇలా సైలెంట్ గా ఉంటే…రేపు పోలీస్ స్టేషన్ కూడా మాదేనని చెప్పుకొని రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్ లోనే పంచాయితీలు కూడా చేస్తారు.ఇప్పటికే జగిత్యాల జిల్లాలో పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు… పోలీసులపై ప్రజలకు నమ్మకం కలగాలంటే… రాజకీయ నేతలు పోలీస్ స్టేషన్ లలో సెటిల్ మెంట్ లు చేయకుండా చూడాలి… అది జరగాలంటే… జిల్లా ఎస్పీ గారు…అది మీ చేతుల్లోనే ఉంది…. పోలీసులపై నమ్మకం కలిగేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీకే తెలియాలి సారు……ఫ్రెండ్లి పోలీస్ అంటే….నిదర్శం ఏంటో కూడా మీరే చెప్పాలి… సారు…అంటూ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Related posts

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినదించిన జిల్లా ఎస్పీ

Rr News Telangana

మెట్ పల్లిలో  జేసిబితో తవ్వకాలు

Rr News Telangana

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group