Rr News Telangana
జగిత్యాల

సమర్థవంతమైన విధులు ద్వారానే అద్భుత ఫలితాలు

  •  ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహణ లో పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం
  • జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ తెలంగాణ :

 జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ గా లోక్ సభ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ అన్నారు. సోమవారం స్థానిక విరుపాక్షి గార్డెన్ జిల్లా పోలీసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు అధికారుల, సిబ్బంది క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించడం వల్లే ఎన్నికలు ప్రశాంత వాతావర ణంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అన్నారు. అవసరమైన ప్రదేశాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసే తనిఖీ లు చేయడం ద్వారా అన్ని రకాల అక్రమ తరలింపులు అడ్డు కోవడం సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో విధుల ను మరింత సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహణ లో కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు .ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్ , భీమ్ రావు ,డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, డిసిఆర్బి, ఎస్బి,సిసిఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, నాగేశ్వర రావు, లక్ష్మీనారాయణ , రఫీక్ ఖాన్, సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి, రవి,సురేష్ ,నవీన్,ఆర్ఐ లు జనీ మియ, రామక్రిష్ణ, వేణు మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

హనుమాన్ జయంతికి కట్టుదిట్టమైన భద్రత

Rr News Telangana

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Rr News Telangana

గణేష్ మృతదేహం లభ్యం

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group