- 5000 వేలు జరిమాన విధించిన కోర్టు
జగిత్యాల ప్రతినిధి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ కి చెందిన బాధితురాలు తన అమ్మమ్మ ఊరైన తీగల ధర్మారం ( ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని గ్రామం) కు సైకిల్ పై వెళ్లేది. తేదీ 11-02-2018న సాయంత్రం 4 గంటల సమయంలో వాళ్ళ అమ్మమ్మ ఇంటి వద్ద లేకపోవడంతో పొలం వద్దకు వెళ్లిందని తెలుసుకొని వెళ్ళగా తీగల ధర్మారం గ్రామ శివారులోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మేర నగేష్ మరియు కొమ్మిర సాయిలు అనే ఇద్దరు కలిసి బాధితురాలని బలవంతంగా చేయి పట్టుకుని పక్కనే ఉన్న మామిడి తోటలకు లాక్కొని వెళ్లి అత్యాచారం చేశారు.. బాధితురాలి అరువడంతో పక్క పొలంలో పనిచేస్తున్న మహేష్ వెళ్లగా మహేష్ ను చూసి ఇద్దరు నిందితులు పారిపోయారు. బాధితురాలు జరిగిన విషయం తన అన్నయ్యకు, అమ్మమ్మకు, అక్కకు తెలుపడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 19 /2018 ,సెక్షన్స్ U/S 376(D) r/w 34 IPC చట్టం కింద ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశ పెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి సుగాలీ నారాయణ, నిందితుని పై నేరం రుజువు కావడంతో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు 5000 వేలు జరిమాన విదిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేస్ లో అడిషనల్ పీపీ గా మల్లేశం,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు ,సిఎమ్ఎస్ ఎస్ఐ రాజు నాయక్, సీఎమ్ఎస్ కానిస్టేబుల్ లు కిరణ్ , కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ లు నిందితులకు శిక్ష పడడంలో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.