Rr News Telangana
జగిత్యాల

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం

  • పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష
  • అదనపు ఎస్పీ వినోద్ కుమార్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ తెలంగాణ :


విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన ఏ.ఎస్.ఐ సత్యనారాయణను శుక్రవారం శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. సుమారు 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏ.ఎస్.ఐ సత్యనారాయణ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అన్నారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆయన ఆకాంక్షిచారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ జానీమియ, ఆర్ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు.

Related posts

జిల్లాలో ఇద్దరు సిఐల బదిలీ

Rr News Telangana

138వ మేడేను జయప్రదం చేయండి

Rr News Telangana

పెండింగ్ కేసులపై ప్రతేక దృష్టి సారించాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group