- అసలు విలేఖరే కాదు….విలేఖరి అంటూ చలామణి
- రెండు, మూడు సంస్థల పేర్లు వాడుకుంటున్న నకిలీ విలేఖరి
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన ఓ యువకు డిని సింగపూర్ పంపిస్తానని నిజామాబాద్ కు చెందిన ముకిమ్ అనే వ్యక్తి 3,20,000 వేలు తీసుకొని యువకుడిని మోసం చేయడంతో బాధితుడు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ముఖిమ్ కు ఫోన్ చేసి మీపై ఫిర్యాదు వచ్చిద్దని పోలీస్ స్టేషన్ కు రావాలని తెలిపారు. నేను విలేఖరిని అంటూ నన్ను అరెస్ట్ చేస్తే మీపై ఆర్టికల్ రాస్తానని ఎస్ఐ కి ధమ్కీ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఓ విలేఖరి ముఖిమ్ కు ఫోన్ చేసి నువ్వు దేంట్లో విలేఖరిగా పని చేస్తున్నవని వివరణ అడిగితే రెండు, మూడు, పత్రిక పేర్లను చెపుతూ వస్తున్నాడు. ముఖిమ్ అనే వ్యక్తి విలేఖరి ముసుగులో ఏజెంట్ దందా చేస్తూ…ఫెక్ వీసాలను ఇస్తూ ప్రజల వద్ద అధిక డబ్బులు లాగుతూ….నేను విలేఖరి అంటూ నాపై పోలీసులు కేసులు పేడితే వారిపై ఆర్టికల్ రాస్తానంటూ పోలీసులను బెదిరిం పులకు గురి చేస్తున్నాడు.ఇలాంటి విలేఖరి వల్ల తోటి విలేఖరులకు చెడ్డపేరు వస్తుందని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి విలేఖరుల ముసుగులో అక్రమాలకు పాల్పడు తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.