విజయవాడ, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వంశీ కృష్ణా నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. వంశీ(22) ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్ లో వంశీ రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.లక్ష చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహ కులు వేధించారు. విషయం తల్లిదండ్రులు చెప్పలేక ఈ నెల 25న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వంశీ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతని లోకేషన్ ను గుర్తించారు. తాడేపల్లిలోని కృష్ణా నది ఒడ్డున అతడి సెల్‌ఫోన్, చెప్పులు, బైక్ ఆధారంగా కృష్ణా నదిలో గాలించి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.