- కోర్టులో ఉన్న వివాదాస్పద స్థలంలో అక్రమ నిర్మాణం
- మున్సిపల్ పర్మిషన్ లేకున్నా పట్టణంలో అక్రమ నిర్మాణం
- కొత్త ఇంటికి పర్మిషన్ లేదు..పాత ఇంటి నెంబర్ పెట్టుకోవచ్చు అంటున్న టిపివో
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మే 20 :
పట్టణంలో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న, కళ్ళముందే కనబడుతున్న అధికారులు లంచాలకు మరిగి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పత్రికల్లో పలుమార్లు కథనాలు వచ్చినా ఫిర్యాదు స్వీకరించిన ఉన్నతాధికారుల నుండి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చిన కూడా తప్పుడు నివేదికలు ఇస్తూ కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. ఈ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాన్ని కూల్చివేయాలని రాష్ట్ర హైకోర్టు నుండి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కోర్టు ఉత్తర్వులను దిక్కరించి స్వయంగా మున్సిపల్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే దీంట్లో ఎన్ని ముడుపులు చేతులు మారాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇంటి నెంబర్ 2-2-89 ను చూపిస్తూ నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి కూల్చివేసి బాధితులకు న్యాయం చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలుపై ఎన్ఫోర్మెంట్ అధికారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ నోటీసులు అందిన కూడా అధికారులు జేబులు నింపుకుంటు అక్రమ కట్టడాలను తొలగించడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు
చర్యలు తప్పవు : తహసీల్దార్ ఆకుల శేఖర్
ఈ విషయంపై మెట్ పల్లి తహసీల్దార్ ఆకుల శేఖర్ ను వివరణ కోరగా నా దృష్టికి ఎన్ఫోర్మెంట్ నుండి నోటీసులు వచ్చాయని అక్రమ కట్టడాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అక్రమ కట్టడాలను గుర్తించి తొలగిస్తాం : –
టిపివో రాజేందర్
ఈ విషయంపై మెట్ పల్లి టిపివో రాజేందర్ కు వివరణ కోరగా అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.