హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనిలాండరింగ్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ రౌస్ ఎవెన్సూ కోర్టు ఆమెకు జుడీషియన్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలిం చారు. ఆ తర్వాత జైలులో ఉన్న సమయంలోనే కవితను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు కవిత. పలుసార్లు బెయిల్ పిటిషన్ వేసిన కోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24 కవిత బెయిల్ పిటిషన్ పై విచారించ నుంది