- బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జెట్టి నరేందర్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ఆర్ కృష్ణయ్య పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని శనివారం బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు జెట్టి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆర్ కృష్ణాయ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎల్లవేళలా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్ కృష్ణయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తని ఆర్.కృష్ణయ్య కు బందోబస్తు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రవి, విశాల్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.