Rr News Telangana
జగిత్యాల

ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

  • ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ కొరకే ఫ్లాగ్ మార్చ్
  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి
  • జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శనివారం జెండా ఊపి ప్రారంబించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ మంచి నీళ్ళ బావి నుండి తీన్ కానీ,టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకు నేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలలో ఆత్మస్థై ర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీ సుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా కి రావడం జరిగింది అని అన్నారు. మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్, రఘు చందర్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, ఆరిఫ్ అలీ, రవి , రామ్ నరసింహారెడ్డి ఖాన్ , ఆర్.ఐలు వేణు , రామకృష్ణ , జనిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు

Related posts

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం ఆధ్వర్యంలో మహిళలకి అవగాహన సదస్సు

Rr News Telangana

పారిశుద్ధ్య కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Rr News Telangana

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group