మెట్ పల్లి, మే 10, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మాజీ మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు పేద ప్రజల పక్షపాతి అని కర్ణాటక రాష్ట్ర చిన్న తరహా నీటిపారుదల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బోసురాజు అన్నారు ఈరోజు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో జరిగిన రత్నాకర్ రావు నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు మాలాంటి ఎందరికో ఆదర్శప్రాయుడని పేద ప్రజలకు ఏ విధంగా సహాయ పడాలో ఆయన నుంచే నేర్చుకున్నామని అన్నారు అంతకుముందు మాట్లాడిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నరసింగరావు తమ తండ్రి స్వర్గీయ రత్నాకర్ రావు అనుక్షణం పేద ప్రజల కోసం పరితపించే వారని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సింది ఉందని తాము తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు రత్నాకర్ రావు మరో తనయుడు కృష్ణారావు మాట్లాడుతూ, ఆశయ సాధన కోసం తాము నిరంతరం పాటుపడుతున్నామని నియోజక వర్గంలో ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటామనిఅన్నారు ఈ కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు మంత్ర గౌడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ యువజ న కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి కోరుట్ల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొంతం రాజం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారిపట్టణ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మచ్చ కవితమేకల నర్సయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ ఎంబేరి సత్యనారాయణ కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీరాముల అమరేందర్ నేమూరి భూమయ్య కటకం దివాకర్ కొత్తపెల్లి రాజేందర్ కొత్తపెల్లి రాజారెడ్డి లింగారెడ్డి దాసరి రాజేశం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు కోరుట్ల మెట్టుపల్లి పట్టణాలకు చెందిన నాయకులు కార్యకర్తలు జువ్వాడి అభిమానులు పాల్గొన్నారు