- 500 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యాక్షుడు
మెట్ పల్లి, మే 09, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం టిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు బత్తుల భరత్ 500 మంది యువకులతో కలిసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . జువ్వాడి నర్సింగ రావు బత్తుల భరత్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు .అనంతరం వారు మాట్లాడు తూ దాదాపు బీఆర్ఎస్ నుంచి 500 మంది యువకు లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, కోమిరెడ్డి విజయ్ ,ఆకుల లింగారెడ్డి ,ఎండి రైస్ ,జెట్టి లక్ష్మణ్ ,కోట దుర్గం రాజు ,అమ్ముల రాహుల్ ,షేక్ తదితరులు పాల్గొన్నారు.