మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మే 06 :
మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసి టీ కేసుపై సోమవారం డిఎస్పి ఉమామహేశ్వర రావు మెట్ పల్లి పట్టణ శివారులోని మైసమ్మ గుట్ట వద్ద విచారణ చేపట్టారు. ఈనెల 4వ తేదీన మెట్ పల్లి పట్టణంలోని మైసమ్మ గుట్ట వద్ద సమాచారం మేరకు అక్రమంగా మొరం తవ్వుతున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా తరి రాజశేఖర్ పై అక్కడే ఉన్న ఇరుగదిండ్ల వెంకటేష్ కులం పేరుతో దూషించ డంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తరి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మెట్ పల్లి ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేయగా , డీఎస్పీ సంఘటన స్థలాన్ని సందర్శించి అక్కడ విచారణ చేపట్టారు. డీఎస్పీ వెంట సిఐ.నవీన్, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు.