మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మే 05 :
కులం పేరుతో దూషించిన ఇరుగదిండ్ల వెంకటేష్ అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. పట్టణానికి చెందిన విలేకరులు తరి రాజశేఖర్, గట్టిపెల్లి రాజశేఖర్ అనే వ్యక్తులు పట్టణంలోని రెగుంట శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళగా అక్కడే ఉన్న పట్టణంలోని డిడి నగర్ కు చెందిన ఇరుగదిండ్ల వెంకటేష్ అనే వ్యక్తి తరి రాజశేఖర్ ను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారురా మిమ్మల్ని చంపేస్తానని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించాడని తరి రాజశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఇరుగదిండ్ల వెంకటేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.