మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మే 01 :
మండలంలోని చౌలామంది గ్రామంలో బుధవారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు మంత్రి శ్రీధర్ బాబు ముందుగా వచ్చి ఏర్పాట్లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు జెట్టి నరేంద్ర మంత్రి శ్రీధర్ బాబుతో జిల్లాలోని విద్యార్థుల ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యల గురించి వివరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లితండ్రులు పేదరికంతో ఫీజులు కట్టలేక పోతే విద్యార్థులను బయటకు పంపిన ఘటన గురించి వారితో వివరించారు. ఇలా విద్యార్థులతో కటువుగా ప్రవర్తించడం మానిపించాలని కోరారు. ఈ సమస్యపై జిల్లా అధికారి డీఈఓ కి కంప్లైంట్ ఇస్తే ఏలాంటి చర్యలు తీసుకోలేదని, వారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై వారి మామూళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోనందుకు, డిఈఓ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా లోని విద్య సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్య మైన విద్యను అందిస్తే నేటి బాలలే రేపటి పౌరులు అని నరేంద్ర అన్నారు. ఇట్టి విషయంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చేస్తానని, అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూస్తానని విద్యార్థులను ఇబ్బంది పెట్టిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల గురించి చక్కగా వివరించినందుకు జరుగుతున్న తెలియజేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు నరేంద్ర నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్వకుంట్ల సుజిత్ రావు మరియు గద్దల భరత్ కోరే రాజకుమార్ పాల్గొన్నారు.