Rr News Telangana
జగిత్యాలమెట్ పల్లి

సహకార శాఖలో సముద్రపు తిమింగలం

  • సహకార సంఘాల డబ్బులు హాంఫట్…?
  • అటెండరే డ్రైవర్ అయ్యాడా…?
  • అక్రమాలకు పాల్పడుతున్న డీసీవో పై చర్యలేవి…?
  • ప్రభుత్వ ఆదాయానికి గండి
  • కమిషన్ల కక్కుర్తిలో డీసీవో
  • భయంతో జంకుతున్న కార్యదర్శులు
  • ఇష్టారీతిగా ఆడిట్ రిపోర్టులు

జగిత్యాల ప్రతినిధి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 30 :

జగిత్యాల జిల్లా సహకార అధికారిగా పని చేస్తున్న మదాసు సత్యనారాయణ గత నాలుగు సంవత్సరాలు గా పలు అవినీతి అక్రమాలకు పల్పడుతునందున అతనిపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు గుసగుసలడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని  సహకార సంఘాలలో డబ్బులు కాపాడా లని  పలువురు కోరుతున్నారు. మదాసు సత్యనా రాయణ, జిల్లా సహకార అధికారి,  జగిత్యాల జిల్లాలో గత (4) సంవత్సరాలుగా జిల్లా ఆడిట్ అధికారిగా మరియు అదనపు బాద్యతలు జిల్లా సహకార అధికారిగా విదులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో  1) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల ద్వారా వరి ధాన్య కొనుగోలు కేంద్రముల నిర్నహణ ద్వారా వచ్చిన కమిషన్ డబ్బుల్లో నుండి 2 నుండి 3 శాతం జిల్లా సహకార అధికారి తన స్వంత అవసరాల నిమిత్తం తిస్కుంటున్న డబ్బులు :- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘముల ద్వారా వారి ధాన్యకొనుగోలు కేంద్రములో నిర్వహిస్తునందుకు  ప్రభుత్వం నుండి ప్రతి క్వింటాలుకు రూ.32/- చెల్లించడం జరుగుతుంది. అయితే ఆ డబ్బులను ప్రభుత్వం సివిల్ సప్లై వారికీ చెల్లించడం జరుగుతుంది. సివిల్ సప్లై వారు ఆ డబ్బులను జిల్లా సహకార అధికారి, జగిత్యాలకి చెల్లిస్తారు. ఇలా జిల్లా సహకార అధికారికి చెల్లించిన డబ్బులను క్వింటాలుకు రూ.32/- తో చెల్లించాల్సిన డబ్బులను రూ.28/- నుండి 30/- మాత్రమే చెల్లించి మిగిలిన డబ్బులను తన స్వంతానికి వాడుకుంటు న్నాడని, గత జిల్లా సహకార అధికారిగా విదులు నిర్వహించిన రామానుజాచార్య ఇలా మిగిలిన డబ్బులను తానూ కొంత మేరకు స్వంతానికి వాడుకొని మిగిలిన డబ్బులు దాదాపు 80 లక్షలు ఫిక్స్డ్ డిపాసిట్ లు గాయత్రీ కో అపరేటివ్ బ్యాంక్,జగిత్యాల బ్రాంచ్ నందు ఎఫ్డి లు చేయడం జరిగినది. మరియు గాయత్రీ బ్యాంక్ సేవింగ్ అక్కౌంట్ లో తన అవసరాల నిమితం దాదాపుగా రూ.20 లక్షలు ఎకౌంటు నెంబర్ 10000 2101001642 లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్టి డబ్బులను జిల్లా సహకార అధికారి మదాసు సత్యనారాయణ తన స్వంత వాహనము హ్యుండై నడుపుకుంటూ ప్రతి నెల రూ.35,000/- పైన తెలిపిన ఎకౌంటు నుండి తీసుకోవడం జరుగుతుంది. తను తన స్వంత వాహనానికి జిల్లా సహకార అధికారి కార్యాలయ అటెండర్ ను డ్రైవర్ గా వాడుకుంటు న్నట్లు విశ్వసనీయ సమాచారం. డీసీవో తన స్వంత కారును నడిపిస్తూ దాన్ని టాక్సీ వెహికల్ పేపర్స్ పెట్టి తన స్వంత వాహనాన్ని మరియు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న అటెండర్ ను తన వాహన డ్రైవర్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబందనల ప్రకారం టాక్సీ వెహికల్ ను పెట్టుకోవాలి అయితే చట్ట ప్రకారం  ఆఫీస్ సిబ్బందిని తన స్వంత అవసరాలకు వాడుకోకకుడదని చట్టము లో ఉన్న కూడా చట్టాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ సొమ్మును తన జేబులో నింపుకుం టున్నాడు. 2) ఆఫీస్ ఫర్నిచర్ లో అవినీతి :- జిల్లా సహకార అధికారి కార్యాలయములో తన చాంబర్లో 20 రూపాయల కర్టైన్స్, తనకు ఉన్న టేబుల్, కుర్చీ మార్పు చేసి కొత్తగా టేబుల్ రూ.35 వేలు, చైర్ రూ. 15 వేలు రైటింగ్ ప్యాడ్ రూ.3 వేలు, మరియు ఆఫీసు ఫర్నిచర్ రూ.7 లక్షలు ఖర్చు ప్యాడి కామిషన్ సేవింగ్ ఖత నుండి తీసి పై అధికారుల పర్మిషన్ లేకుండానే డబ్బులను వాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3) కమర్షియల్ పెట్రోల్ బంకులను సంఘాలలో ఏర్పాటు కొరకు బ్రోకర్ నుండి జిల్లా కార్యాలయములో మీటింగ్ నిర్వహించి సంఘ డబ్బులను బ్రోకర్ ఇప్పించడములో అవినితికి పాల్పడుతున్నట్లు సమాచారం. అంతకు ముందున్న పెట్రోల్ బంక్ లు కమూసివేసిన ఆ సమయంలో వాడుకున్న మదాసు సత్యనారాయణ ఒక బ్రోకర్ ను జిల్లా సహకార కార్యాలయములోకి పిలిచి  5 సంఘముల నుండి ప్రతి సంఘం నుండి రూ.5 లక్షలు వసూళ్లు చేయడం జరిగిందని సమాచారం. ఇందులో భాగంగా 1) నంచెర్ల 2 బంక్ ల కొరకు రూ.10 లక్షలు 2) రాయికల్ రూ.5 లక్షలు 3) జగిత్యాల రూ 5 లక్షలు అగ్రిమెంట్ ప్రకారం 6 నెలలో అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసి ఇస్తానని అగ్రిమెంట్ చేయించుకొని 2 సంవత్సరాలు అయిన ఎలాంటి పని జరుగలేదు. డబ్బులు చెల్లించిన సంఘాల అధ్యక్షుల, కార్యదర్శుల ఫోన్ లు బ్రోకర్ లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణ. మాదాసు సత్యనారాయణ  20% కమిషన్ డబ్బులకు ఆశపడి సంఘములను నష్టాలలో ముంచుతున్నట్లు సమాచారం. అయితే సంఘ కార్యదర్శులు తిరిగి డబ్బులను అడగటానికి భయపడుతున్నారు. దీనిపై రాయికల్ సంఘ ఆడిట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆడిటర్  స్పెషల్ రిపోర్ట్ ఇచ్చిన ఆడిటర్ నే పిలిచి మందలించినట్టు అట్టి ఆడిటర్ పై కక్ష సదింపు చేస్తునారని గుసగుసలాడుతున్నారు. ఇలానే ప్రాదమిక వ్యసాయ సహకార సంఘము మల్లాపూర్ మండలంలోని  సిరికొండలో కూడా సంఘ అధ్యక్షున్ని మభ్య పెట్టి అతని నుండి సంఘానికి చెందిన డబ్బులను రూ.13 లక్షలు బ్రోకర్ కు ఇచ్చినట్లు సమాచారం.  రెండు సంవత్సరాలు గడిచిన కూడా ఎలాంటి పనులు జరగడం లేదని  ఆడిటర్ స్పెషల్ రిపోర్ట్ ఇచ్చిన కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కోసమేరకు. రిపోర్ట్ ఇచ్చిన ఆడిటర్ పై కక్ష సదింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా తనకు అనుకూలంగా ఉన్న బ్రోకర్ ను పిలిపించి కమిషన్ లు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారి మాదాసు సత్యనారాయణ  గతంలో నిర్మల్ మరియు నిజామాబాదు జిల్లాలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.  4)  బలాపూర్ లో పని చేస్తున్న పలువురు సిబ్బందిని తీసి వేసి తన అన్న కొడుకుని సంఘములో తీసుకొని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము లిమిటెడ్, కోరుట్ల మండలంలోని ఐలాపూర్ లో పని చేస్తున్న లోకల్ సిబ్బందిని తొలగించి వల్గొండ గ్రామానికి చెందినా తన అన్న కొడుకుని కంప్యూటర్ ఆపరేటర్ గా తీసుకొనుటకు సంఘ అద్యక్షులను ఒత్తిడి చేసి తన అణా కొడుకుని నియమిచినట్లు సమాచారం. బలాపూర్ నుండి వల్గొండ గ్రామం దాదాపు 35 కిలో మీటర్ లు. దూరంలో ఉన్న కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నట్లు  విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా సహకార సంఘం అధికారులు దీనిపై ప్రత్యేక చొరవ చూపి చట్ట ప్రకారం విచారణ జరిపి జిల్లా అధికారి మాదాసు సత్యనారాయణ పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 5) ఎంక్వైరీ 51 లను అనుకూల ఆఫీసు సిబ్బందితో చేయిస్తున్నట్లు. జిల్లా సహకార కార్యాలయ తన అనుకులంగా ఉన్న సిబ్బందితో తనకు డబ్బులు ఇవ్వని సంఘాలపై కక్ష సదింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  జగిత్యాల జిల్లాలో కిడా నలుగురి కార్యదర్శులను తొలగించినట్లు తెలుస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన స్వంత నిర్ణయంతో అద్యక్షులపై ఒత్తిడి చేసి తొలగించడం జరిగినట్లు సమాచారం. 6) ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మల్లాపూర్ మండలంలోని సిర్పూర్లో ఎంక్వైరీ 51 ను డిప్యూటీ రిజిస్టర్ హోదాలో చేయడం. జగిత్యాల జిల్లాకు వచ్చిన మొదట్లో మెట్ పల్లి ఫీల్డ్ లో విదులు నిర్వహిస్థున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ని ఒత్తిడి చేసి మదాసు సత్యనారాయణ తను రాసుకొని వచ్చిన ఓ లేఖలో సంతకము తీసుకోని అట్టి లేఖను అసిస్టెంట్ రిజిస్ట్రార్ పాక్స్ సిర్పూర్ లో అవినీతి జరుగుతున్నట్లు సృష్టించి, పలువురు తను ఫిర్యాదు చేసినట్లు కట్టుకథలను అల్లి తనకు తాకే (మదాసు సత్యనారాయణ) ఎంక్వైరీ 51 చేయమని చెప్పి, సంబంధిత సిబ్బంది ఉన్న కూడా డీసీవోనే ఆడిట్ ఆఫీసర్  గా మారి  డబ్బుకు ఆశపడి తనే ఆడిట్ చేయడం జగిరినట్లు సమాచారం. అయితే మొత్తం 6 నెలలు చేసిన ఎంక్వెరీ లో కేవలం సంఘానికి 3 సార్లు మాత్రమే వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రైతులకు అందుబాటులో ఉండి చేయాల్సిన ఎంక్వైరీ ను వివిధ సంఘాలలో పనిచేస్తున్న తనకు అనుకూలమైన సిబ్బందితో ఎంక్వయిరీ చేయించి తనకు అనుకూలంగా రిపోర్ట్ ను మార్చువడం  కొసమెరుపు. జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి లో విదులు నిర్వహిస్తున్న పవన్, యకీన్పూర్ సంఘములో విదులు నిర్వహిస్తున్న రమేష్, బండలింగాపూర్ లో విదులు నిరవహిస్తున్న శేఖర్ లతో చేయించుకొని రిపోర్ట్ తు తు మంత్రముగా రిపోర్టులను తనకు అనుకూలంగా ఇచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఓ సంఘ కార్యదర్శికి న్యాయం చేస్తానని నమ్మించి అతడి వద్ద అధిక  డబ్బులు  డిమాండ్ చేయడంతో ఆ కార్యదర్శి 7 లక్షలకు ఒప్పందం కుదిర్చుకొని డబ్బులు చెల్లించినట్లు సమాచారం. డబ్బులు చెల్లించి అనంతరం మరి కొన్ని డబ్బులు చెల్లించాలని అడుగగా  ఆ కార్యదర్శి నిరాకరించాడు. దీంతో ఆ కార్యదర్శి పై కక్ష పెంచుకొని ఆ కార్యదర్శి తప్పులేకున్న ఆడిట్ ముగిసిపోయింన అనంతరం కూడా  లోన్ కు సంబంధీచిన వడ్డీ తక్కువగా తీసుకున్నాడని అతనిపైనే తప్పుడు ఆరోపణలు చేసి అతని వద్ద నుండి రికవరీ చేయాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. జిల్లా సహకార అధికారి, జగిత్యాల తన సొంత జిల్లా లో విధులు నిర్వహిస్తూ అందరిని భయ బ్రంతులకు గురి చేస్తున్నట్లు పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే  జిల్లా అధికారి ఉండవలసింది జిల్లా హెడ్ క్వార్టర్ లో కానీ నేనే రాజు నేనె మంత్రిగా అన్నచందన వ్యవస్తున్నాడు. జిల్లాలో ఉండాల్సిన అధికారి నిజామాబాద్ జిల్లాలో ఉంటూ ప్రతి రోజు జగిత్యాల జిల్లాకు  వస్తుంటాడు. వరి ధాన్య కొనుగోలు జరుగుతున్నా పలువురు రైతుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా తనకేమీ పట్టనట్టుగా జిల్లా అధికారి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా డీసీవో పై తగిన విచారణ జరిపి డీసీవో మాదాసు సత్యనారా యణపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయం పై ప్రత్యేక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related posts

దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 

Rr News Telangana

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో రెడ్డిలా రాజ్యం

Rr News Telangana

మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క కన్నుమూత

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group