Rr News Telangana
నిజామాబాద్

కువైట్ దేశంలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ జిల్లావాసి

  • కువైట్ GWAC సంస్థ సహకారంతో స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం 

నిజామాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : 

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కలిగోట గ్రామానికి చెందినటువంటి ఆముదాల హరీష్ గౌడ్ (29) సంవత్సరాలు. బ్రతుకుతెరువు కోసం కువైట్ దేశం వచ్చి రెండున్నర సంవత్సరాలుగా కువైతి ఇంట్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల తో మనస్థాపానికి గురైన హరీష్ గౌడ్ గత నెల రంజాన్ మాసం మార్చి 22 తెల్లవారుజామున పనిచేస్తున్న ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. మృతు డు చనిపోయిన విషయాన్ని నెల రోజుల తర్వాత కుటుంబానికి తెలపడంతో కుటుంబ సభ్యులు తమ సమీప బంధువు దుబాయ్ లో ఉన్నటువంటి సత్యం గౌడ్ కు తెలపడంతో సత్యం గౌడ్ దుబాయ్ GWAC అధ్యక్షులు రవి కటకంకు తెలపడంతో, కువైట్ శాఖ అధ్యక్షులు ఆనంద్ కుమార్ మగ్గిడి ఈ విషయాన్ని తెలిపి ఎట్టి పరిస్థితుల్లోనైనా మృతదేహాన్ని స్వగ్రామా నికి పంపించాలని విన్నవించడంతో. మృతదేహాన్ని తరలించే విషయంలో కువైట్ GWAC అధ్యక్షులు ఆనంద్ కుమార్ మరియు GWAC కువైట్ శాఖ మాజీ అధ్యక్షులు శ్రీ షేక్ వాజిద్ చొరవ తీసుకొని మృతదే హన్ని శనివారం స్వగ్రామానికి పంపించారు. హైదరా బాద్ విమానాశ్రయం నుండి స్వగ్రామానికి ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయాలని NRI సెల్ సెక్రెటరీ శ్రీ చిట్టి బాబును ఆనంద్ కుమార్ కోరడంతో మృతుని అంత్యక్రియలు స్వగ్రామంలో సోమవారం నిర్వహిం చారు. హరీష్ గౌడ్ మృతదేహాన్ని తరలించడంలో ప్రత్యేక చొరవ చూపిన కువైట్ శాఖ మాజీ అధ్యక్షుడు  షేక్ వాజిద్, ప్రస్తుత GWAC కువైట్ శాఖ అధ్యక్షులు  ఆనంద్ కుమార్ మరియు కువైట్ లో ఉన్న మృతుడు హరీష్ గౌడ్ సమీప బంధువు నిబుల్ గౌడ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి :

ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి గల్ఫ్ దేశాల్లో చనిపోయినటువంటి ప్రతి గల్ఫ్ కార్మికుని కుటుంబా నికి భరోసాగా తక్షణ సహాయం కింద 25 వేల రూపా యలు మరియు ఐదు లక్షలు ఆర్థికసాయం ప్రకటించా లని అలాగే 500 కోట్ల రూపాయలతో సంపూర్ణ ఎన్నారై పాలసీ ప్రకటించాలని జిడబ్ల్యుయేసి కువైట్ శాఖ తర పున తదితరులు కోరారు.

Related posts

అక్రమ భారీ ఇసుక డంప్లు సీజ్ చేసిన అధికారులు

Rr News Telangana

చదువుకోమని చెప్పినందుకు డిగ్రీ విద్యార్థిని చంపిన ఇంటర్ విద్యార్థులు

Rr News Telangana

క్రిష్ణవేణిలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group