- ఏఐటియుసి నాయకుడు ఉస్మాన్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 138వ మే-డే సందర్భంగా మే-డే వాల్ పోస్టర్, కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ నాయకుడు ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ, 4 లేబర్ కోడ్ లు రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి మున్సిపల్ కార్మికులను అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆటో, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టానికి తేవాలి భవన నిర్మాణ కార్మికులకు10 లక్షల ప్రమాద బీమా ప్రకటిం చారలి అదేవిధంగా 5000 పెన్షన్ చెల్లించాలి డిజిటల్ పెట్రోల్ నిత్యవసర ధరలపై జిఎస్టి తగ్గించాలి. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ బిఓసి సెక్రటరీ రామిల్ల రాంబాబు, మున్సిపల్ కార్మికులు శ్రీకాంత్, లక్ష్మణ్, మహేష్, రాజశేఖర్, శంకరమ్మ, గంగారం, సురేష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.