- జిల్లా వ్యాప్తంగా నాక బంధీ విస్తృత తనిఖీలు
- నెంబర్ ప్లేట్స్ లేని 138 వాహనాలను సీజ్
- 3,91,700 రూపాయల నగదు పట్టివేత
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
అసాంఘిక కార్యకలాపాలను,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే నాక బంధీ కార్యక్రమం.
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రo 5 గంటల నుండి రాత్రి 9:30 నిమిషాల వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకా బంధీ నిర్వహించడం జరిగింది. నాకా బంధీలో ప్రతి ఒక్క వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసారు. సుమారు 1000 వాహనాలు తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 138 వాహనాలను సీజ్ చేశారు. కొందరు అనుమానితులని విచారించి వారి ఆధార్ కార్డు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు , నేరాల అదుపుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసులు లక్షమని తెలిపారు. జిల్లా లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాలు తగ్గు ముఖం, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు. ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించలని కోరారు.