మెట్ పల్లి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. బాధితురాలు పోచంపల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం చుట్టాల ఇంటికి పండుగ నిమిత్తం ఊరు వెళ్ళగా గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని గ్రామ పెద్దలకు సమాచారం అందించగా గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం అందించారని, సుమారు ఐదున్నర తులాల బంగారం పదిహేను తులాల వెండి, 42 వెల నగదు ఎత్తుకెళ్ళినట్లు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు క్లూజ్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.