కొమురంభీం, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 25 :
కొమరంభీం – బెజ్జూరు మండలం ఉంద్రీగాం గ్రామానికి చెందిన సాయితేజ (5) అనే బాలుడు బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.గమనించిన స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. కుక్కలు తలపై కరవడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.