- ప్రణాభయంతో జంకుతున్న పట్టణ ప్రజలు
- ట్రాక్టర్ల యాజమానుల ఇష్టా రాజ్యంగా మారిన వైనం
- అమ్యామ్యలకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు.
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 24 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న మైసమ్మ గుట్ట నుంచి జేసీపీ యంత్రం సహాయంతో అక్రమ మట్టి తరలింపు యదేచ్ఛగా సాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తరలింపు దందా “మూడు పువ్వులు ఆరు కాయలు”అన్న చందంగా సాగుతుంది. మైసమ్మ గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల ద్వారా మట్టి తవ్వకాలు చేసి వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అడిగే వారులేక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మట్టి తరలించి లక్షలల్లో సొమ్ము చేసుకుంటున్నారు.ఒక్క ట్రిప్ కు రూ.1100 చొప్పున మట్టిని అమ్ముకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అంతే కాదు ట్రాక్టర్ల కు నెంబర్ ప్లేట్లు ఉండవు, డ్రైవర్లకు లైసెన్స్ ఉండదు. ప్రమాదం జరుగుతే ఇక అంతే..? మైసమ్మ గుట్ట నుంచి మట్టి తరలింపు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తూ కొందరు అక్రమార్కులు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు :
మైసమ్మ గుట్ట నుంచి మంగళవారం ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మైసమ్మ గుట్ట నుంచి ట్రాక్టర్ల ద్వారా అతివేగంగా రాత్రి,పగలు లేకుండా మట్టిని తరలిస్తున్నట్లు అధికారులకు పిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అంటే ఆంతర్యం ఏమిటని ప్రజల్లో పలు అనుమానం మొదలైంది. ప్రత్యేక అధికారుల పాలన మొదలు కావడంతోనే అక్రమ మట్టి తరలింపునకు తెరలేపినట్లైందన్నారు.మట్టి తరలింపుతో మైసమ్మ గుట్ట ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయని పట్టణ ప్రజలు తెలిపారు. మట్టి తరలింపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.అక్రమ మట్టి తరలింపుపై సంబంధిత మెట్ పల్లి రెవిన్యూ తహసీల్దార్ ఆకుల శేఖర్ కు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదని, స్థానిక పోలీస్ సిబ్బంది మట్టి తరలిస్తున్న స్థలానికి వెళ్లి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారిచ్చే కాసులకు ఆశపడి తిరిగి రావడం జరుగుతుందని స్థానిక ప్రజలు బహు మాఠంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమంగా తరలించిన మట్టిని స్వాధీనం చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.