- ధరణిలో ఏది కొడితే అదే వస్తది..!
- ధరణి మొత్తం తప్పే అంటున్న మెట్ పల్లి మండల సర్వేయర్ గుగులోతు తులియా నాయక్
- వైరల్ అవుతున్న సర్వేయర్ గుగులోతు తులియా నాయక్
- నా ఆడియో రికార్డును బయటపెట్టి నన్ను ఎవరు ఎమ్ చేయలేరు
- పై అధికారులంతా నావాల్లే నన్ను ఎవరు ఎమ్ చేయలేరు అంటున్న సర్వేయర్ గుగులోతు తులియా నాయక్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 20 :
మెట్ పల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మెట్ పల్లి మండల సర్వేయర్ ధరణి మొత్తం తప్పెనని ధరణిలో ఏదీ కొడితే అది వస్తది అంటున్న వాయిస్ రికార్డు వాట్సప్ గ్రూప్ లలో వైరల్ కావాడంతో దీనిపై మెట్ పల్లి మండల సర్వేయర్ తులియా నాయక్ ను వివరణ కోరగా అయితే ఏంటని ఆ ఆడియో రికార్డుతో నన్ను ఏ అధికారి నన్ను ఎమ్ చేయలేరని మీడియాతో దురుసుగా మాట్లాడడం గమనార్హం. ప్రజలు ఎమ్ మాట్లాడిన తప్పులేదు కానీ నేను మాట్లాడితే తప్పేంటి అనడం శోచనియం. ఈ విషయంపై మెట్ పల్లి ఎమ్మార్వో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.