Rr News Telangana
ఇబ్రహీంపట్నంజగిత్యాలమెట్ పల్లి

గండి హన్మాండ్లు, ఓబులపూర్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 20 :


జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లపూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గండి హన్మడ్లు, ఓబులపుర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని, జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను పకడ్బందీగా 24×7 వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లాలోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్య వేక్షణలో చెక్ పోస్టు లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.

Related posts

రత్నాకర్ రావు వర్ధంతి సభలో కర్ణాటక మంత్రి బోసురాజు

Rr News Telangana

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతాం

Rr News Telangana

నేను విలేఖరిని అంటూ పోలీసులకు ధమ్కీ…

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group