అమెరికా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న 20, 22 ఏళ్ల ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. షాప్‌రైట్ స్టోర్ పోలీసులను అప్రమత్తం చేయడంతో ఇద్దరు తెలుగు అమ్మాయిలను అరెస్టు చేశారు. గత నెలలో గ్రాసరీ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థినిలను అమెరికాలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 22 ఏళ్ల మరో యువతి స్టీవెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్య సించడానికి USలోని న్యూజెర్సీకి వెళ్లారు. హాబోకెన్ షాప్‌రైట్ అనే గ్రాసరీ స్టోర్‌లో కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు డబ్బు చెల్లించలేదనే ఆరోపణలపై మార్చి 19న US పోలీసులు వీరిని అరెస్టు చేశారు.