* 8 వేల నగదు, 5 సెల్ ఫోన్ లు, 9 మోటార్ సైకిల్ లు స్వాధీనం
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 18 :
మెట్ పల్లి పోలీసులు బుధవారం రాత్రి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 8 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, 9 మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఏఎస్ఆర్ తండాలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 14 మందిని పట్టుకోవడానికి ప్రయత్నంచిగా 9 మంది పరారు కావడంతో మిగిత 5 గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, 9 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
పట్టుబడిన వారు : కమ్మర్ పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన సంత లింగారెడ్డి, కోరుట్లకు చెందిన జగన్నాథ లక్ష్మణ్, నడికుడకు చెందిన కారిపెళ్లి నర్సారెడ్డి, తిమ్మాపూర్ కు చెందిన ఏలేటి గంగారెడ్డి, కమ్మర్ పల్లికి చెందిన కర్రె నీలకంఠంలు ఉన్నారు.పరారీలో ఉన్న 9 మందిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ చిరంజీవి తెలిపారు.