- కటుకం బ్రదర్స్ ఇంట్లో పోలీసుల సోదాల
- కిలోన్నర బంగారం
- ఏడు లక్షల నగదు సీజ్
మెట్ పల్లి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 14 :
జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీంద్ర కుమార్ ఉత్తర్వులతో మెట్ పల్లి పట్టణంలో ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా పాన్ బ్రోకర్స్ పేరుతో ప్రజల వద్ద నుండి బంగారం తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్నారని సమాచారంతో మెట్ పల్లికి చెందిన కట్కం బ్రదర్స్ ఫైనాన్స్, వారి ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. కిలోన్నర బంగారంతో పాటు 7 లక్షల నగదు,13 ప్రాంసరి రిసిప్ట్ బుక్ లను స్వాధీన పరుచుకున్నట్లు మెట్ పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న కట్కం ప్రకాష్ ,రమేష్, శివ, కార్తీక్ లపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని మెట్ పల్లి ఎస్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం మొదలైన సోదాలు ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగాయని అన్నారు.