- భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 10 :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో, మాల విరమణ, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, మల్యాల సి.ఐ రవి, ఎస్.ఐ రహీం ఉన్నారు.