మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 04 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామంలోని పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లాట్ ఫామ్ వేదికగా సైబర్ అంబాసిడర్ ఇన్ స్టిట్యూర్ సెరామణిలో భాగంగా అయేషా, మేఘన , ప్రియ, లిఖితలు ఆన్ లైన్ శిక్షణ పూర్తి చేసుకున్నారని, వీరిని సైబర్ అంబాసిడర్ గా నియమించడం జరిగిందని, సైబర్ నేరాలు జరుగుతున్న విధానాన్ని వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారని, సైబర్ నేరాలు జరుగుతున్న విధానాన్ని విద్యార్థులు స్కిట్ ద్వారా వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, మాజీ ఎస్ఎమ్ఎస్ ఛైర్మన్ సత్యనారాయణ, మాజీ విడిసి ఛైర్మన్ పరందాములు, విడిసి చైర్మన్ కాశిరామ్, ఉపాద్యాయులు విజేందర్ రెడ్డి, శ్రీరాములు, జలెండర్ తదితరులు పాల్గొన్నారు.