మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 03 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గత జనవరిలో 40 మంది గల్ఫ్ బాధితులకు నకిలీ వీసాలు ఇచ్చారు. హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు వెళ్లిన 40 మంది నకిలీ వీసాలు అని తెలియడంతో మెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో 5 గురు నింధితులు ఉండగా అందులో A1 గా ఉన్న ఏలేటి రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో 4 గురు పరారీలో ఉండగా అందులో A2 గా ఉన్న మహ్మద్ హసిఫ్ ను బుధవారం పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ చిరంజీవి తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.