Rr News Telangana
జగిత్యాల

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

  • జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 02 :

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని మంగళవారం జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.

Related posts

జిల్లాకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Rr News Telangana

కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన తప్పనిసరి

Rr News Telangana

రేచుపల్లిలో పోగుల రాజేశం కిడ్నాప్

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group