మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 01 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను సోమవారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బంది పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చునని అన్నారు.త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ లు నిర్వహించి ఓటర్ల కు భద్రతా భావాన్ని కలిగించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేరస్తుల, రౌడీ షీటర్ల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. అదికారులు,సిబ్బంది సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల, సైబర్ నేరగాలు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఓటర్లను ప్రభావితం చేసే ఎన్నికల నేరస్థులపై, రౌడీ షీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని,వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉమా మహేశ్వర రావు ,సి.ఐ నవీన్, ఎస్.ఐ చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.